Sugar Baby: బోల్డ్ కాక్‌టెయిల్‌లా ‘షుగర్ బేబీ’.. ట్రెడింగ్‌లో మరోసారి స్టార్ హీరోయిన్

by Chukka Sudharani |

కమల్ హాసన్ (Kamal Haasan) నటిస్తున్న లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ (Gangster) యాక్షన్ డ్రామా ‘థగ్ లైఫ్’.

Sugar Baby: బోల్డ్ కాక్‌టెయిల్‌లా ‘షుగర్ బేబీ’.. ట్రెడింగ్‌లో మరోసారి స్టార్ హీరోయిన్
X

దిశ, సినిమా: కమల్ హాసన్ (Kamal Haasan) నటిస్తున్న లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ (Gangster) యాక్షన్ డ్రామా ‘థగ్ లైఫ్’. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మ్యూజికల్ యూనివర్స్ స్టార్ట్ అయింది. ఈ పాన్ ఇండియా మూవీ సింగిల్ ‘షుగర్ బేబీ’ (Sugar Baby) రిలీజ్ అయ్యింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (AR Rahman) స్వరపరిచిన ఈ పాట ఆడియన్స్ మనసుల్ని కొల్లగొట్టింది. స్లిజీ చార్మ్‌‌తో పాటు, అదిరిపోయే వైబ్‌తో ఈ పాట, రిథమ్‌, అటిట్యూడ్‌ బ్లెండ్‌తో ఓ బోల్డ్ కాక్‌టెయిల్‌లా ఆకట్టుకుంటోంది. ఇందులో త్రిషా కృష్ణన్ (Trisha Krishnan) మెస్మరైజింగ్ బ్యూటీతో కనువిందు చేసింది. ఆమె లుక్స్, గ్రేస్, అన్నీ కలసి తెరపై మ్యాజిక్‌ని సృష్టించాయి. దీంతో మరోసారి ఈ స్టార్ బ్యూటీ నెట్టింట ట్రెడింగ్‌లోకి వచ్చేసింది.

రవికే చంద్రన్ అందించిన విజువల్ ఎస్టెటిక్ టచ్‌తో ప్రతి ఫ్రేమ్ విజువల్ ట్రీట్‌గా కనిపిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. ఇప్పుడు వచ్చిన ఈ సింగిల్ ‘థగ్ లైఫ్’పై మరిన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ను క్రియేట్ చేసింది. కాగా.. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ అధినేత ఎన్. సుధాకర్ రెడ్డి గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.

Next Story