కమల్ హాసన్‌‌ను చంపేస్తా.. బెదిరింపులకు దిగిన నటుడు

by Sujitha Rachapalli |

లోకనాయకుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్‌కు వార్నింగ్ ఇచ్చాడు టీవీ నటుడు రవిచంద్రన్. సనాతన ధర్మం గురించి ప్రతికూలంగా మాట్లాడిన సూపర్ స్టార్‌ను చంపేస్తామని బెదిరించాడు. ఇలాంటి మాటలు మాట్లాడితే గొంతు కోస్తాననని హెచ్చరించాడు.

కమల్ హాసన్‌‌ను చంపేస్తా.. బెదిరింపులకు దిగిన నటుడు
X

దిశ, వెబ్ డెస్క్ : లోకనాయకుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్‌కు వార్నింగ్ ఇచ్చాడు టీవీ నటుడు రవిచంద్రన్. సనాతన ధర్మం గురించి ప్రతికూలంగా మాట్లాడిన సూపర్ స్టార్‌ను చంపేస్తామని బెదిరించాడు. ఇలాంటి మాటలు మాట్లాడితే గొంతు కోస్తాననని హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూ వైరల్ కాగా భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. కమల్ హాసన్ మక్కల్ నీది మయం నాయకులు ఈ విషయంపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. రవిచంద్రన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించనట్లు తెలుస్తోంది.

అసలు విషయం ఏమిటంటే.. చెన్నైలో ఈ మధ్య జరిగిన హీరో సూర్య ఆగరం ఫౌండేషన్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కమల్ హాసన్. ఈ సందర్భంగా సనాధర్మం చెడు ఫలితాన్ని ఇస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. విద్య సర్వాధికారమని.. సనాతన ధర్మపు మూలాలను ఛేదించే ఏకైన ఆయుధమని పేర్కొన్నాడు. ఈ స్పీచ్ తర్వాత కమల్ హాసన్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ముఖ్యంగా బీజేపీ నాయకులు కమల్ హిందువుల మనోభావాలను కించపరిచాడని.. ఆయన సినిమాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

Next Story