- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కల్కి’ సినిమా క్లైమాక్స్ వివాదం.. ఒక్క పోస్ట్‌తో ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగ్ అశ్విన్
యుద్ధభూమిలో అర్జునుడితో శ్రీకృష్ణుడు స్వయంగా కర్ణుడి గొప్పతనాన్ని, పరాక్రమాన్ని ప్రస్తావించిన సందర్భాలను ఆయన గుర్తు చేశారు.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. వచ్చిన ‘కల్కి’ సినిమా బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మూవీ భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటుగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ విజువల్ వండర్‌కు సీక్వెల్‌గా ‘కల్కి-2’ను తెరకెక్కించే పనుల్లో మేకర్స్ బిజీగా ఉన్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే మొదటి భాగంలో చూపించిన కొన్ని అంశాలపై సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ మొదలయ్యాయి. ముఖ్యంగా ‘కల్కి’ సినిమాలో కర్ణుడి పాత్రను చూపించిన తీరు, అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్‌పై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని అఖిల్ నటించిన ‘లెనిన్’ సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్ట్‌లో ఒక నెటిజన్.. నటుడు ప్రమోద్ పంజు నటనను ప్రశంసిస్తూనే, కల్కి సినిమాలో కర్ణుడి పాత్రను నాగ్ అశ్విన్ చాలా అతిగా చూపించారని ఆరోపించారు.
అంతేకాకుండా, సినిమా క్లైమాక్స్‌ను దైవదూషణగా అభివర్ణించడంతో ఈ అంశం నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. ఈ విమర్శలపై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా ఎక్స్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. మహాభారతంలోని ద్రోణ వధ పర్వానికి చెందిన ఒక అధికారిక పేజీని స్క్రీన్‌షాట్‌గా షేర్ చేస్తూ.. యుద్ధభూమిలో అర్జునుడితో శ్రీకృష్ణుడు స్వయంగా కర్ణుడి గొప్పతనాన్ని, పరాక్రమాన్ని ప్రస్తావించిన సందర్భాలను ఆయన గుర్తు చేశారు. విమర్శలు చేసే ముందు మహాభారతాన్ని పూర్తిగా చదవాలని, లేదా కనీసం శ్రీకృష్ణుడు కర్ణుడిని ఎన్నిసార్లు ప్రశంసించాడో తెలుసుకోవాలని నాగ్ అశ్విన్ సూచించారు. భారతీయ ఇతిహాసాలపై, పురాణాలపై తనకు అపారమైన గౌరవం ఉందని, వాటన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పూర్తి అవగాహనతోనే సినిమా తీశానని ఆయన స్పష్టం చేశారు. ఒక దర్శకుడిగా తాను ఏం చేస్తున్నానో తనకు పూర్తిగా తెలుసని నొక్కి చెప్పిన నాగ్ అశ్విన్.. విమర్శకులకు చురకలు అంటిస్తూ "కల్కి పార్ట్-2 కోసం వేచి ఉండండి" అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ పోస్ట్‌తో విమర్శలకు చెక్ పడినట్లు అయింది.






