దుల్కర్ సల్మాన్ 'కాంత' ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్

by velandi.Saikiran |   (  Updated:2025-12-23 15:48:20  IST  )

దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తుండగా భాగ్య శ్రీ హీరోయిన్ గా మెరుగనుంది. న‌వంబ‌ర్ ఆరో తేదీన ఫుల్ ట్రైలర్ రిలీజ్

దుల్కర్ సల్మాన్ కాంత ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దుల్క‌ర్ స‌ల్మాన్... మ‌న తెలుగు హీరో కాక‌పోయినా, అత‌నికి ఇక్క‌డ మంచి ఫాలోయింగ్ ఇచ్చింది. ఆయ‌న న‌టించిన ప్ర‌తీ సినిమాను తెలుగు ప్ర‌జ‌లు బాగానే ఆద‌రిస్తున్నారు. ఇటీవ‌లే ల‌క్కీ భాస్క‌ర్ సినిమాతో దుమ్ముదులిపారు. బాక్సాఫీస్ ను కుదిపేశారు. ఇక ఇప్పుడు కాంత ( Kaantha) సినిమాతో ఇప్పుడు దుల్క‌ర్ స‌ల్మాన్ వ‌స్తున్నారు.

ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా చేస్తుండగా భాగ్య శ్రీ హీరోయిన్ గా మెరుగనుంది. ఇక సముద్రఖని ప్రత్యేక పాత్రలో ఈ సినిమాలో మెరుస్తున్నారు. ఈ ఈ సినిమాను సెల్వమణి సెల్వ రాజు ( Selvamani Selvaraj ) చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. రానా ( Rana Daggubati) ఈ సినిమాకు నిర్మాతగా ఉండడం గమనార్హం. నవంబర్ 14వ తేదీన కాంత సినిమా రిలీజ్ కానుంది.

ఇలాంటి నేపథ్యంలో ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది చిత్రబృందం. తాజాగా ట్రైలర్ లాంచ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగానే ట్రైలర్ గ్లింమ్స్ వీడియోను కూడా విడుదల చేసింది. న‌వంబ‌ర్ ఆరో తేదీన ఫుల్ ట్రైలర్ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటన చేసింది. ఇక ఇవాళ రిలీజ్ అయిన ట్రైలర్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Next Story