- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dadaphalke Film Festival 2025: దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో ఎంపికైన తెలుగు మూవీ.. నెట్టింట పోస్ట్ వైరల్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘రాజా వారు రాణి గారు’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘రాజా వారు రాణి గారు’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా స్టార్ ఢమ్‌ను తెచ్చుకోలేకపోయాడు. ఇక ఈ హీరో గతేడాది ‘క’ (Kaa) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుజీత్, సందీప్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ మూవీ గతేడాది దీపావళి స్పెషల్‌గా అక్టోబర్ 31న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో కిరణ్ అబ్బవరం కూడా తన సినీ కెరీర్‌లో జోరు పెంచాడు. సైకలాజికల్ థ్రిల్లర్ (Psychological thriller) చిత్రంగా రూపొందిన ఈ మూవీ తాజాగా ఓ ఘనత సాధించింది.
‘క’ సినిమా ప్రతిష్టాత్మక 15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్(Dadaphalke Film Festival 2025)లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో నామినేషన్ పొందింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ షేర్ చేసిన ఈ పోస్టర్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. కంగ్రాట్స్ చెబుతున్నారు నెటిజన్లు. కాగా.. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్‌గా నటించారు. ‘క’ సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించారు.






