- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సూర్య-జ్యోతిక.. బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తూ పోస్ట్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya)గత ఏడాది ‘కంగువా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’(Retro).

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya)గత ఏడాది ‘కంగువా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’(Retro). కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే దీనిని 2D ఎంటర్‌టైన్‌మెంట్స్, స్టోన్ బెంచ్ బ్యానర్స్‌పై సూర్య, జ్యోతిక(Jyothika) నిర్మిస్తున్నారు. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మే 1న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, సూర్య- జ్యోతిక కలిసి పలు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి వచ్చారు. వీరిద్దరు ముందుగా కొల్లాపూర్ శక్తి పీఠానికి వెళ్లి అక్కడ అమ్మావారిక పూజలు చేశారు.
అనంతరం కామాఖ్య ఆలయానికి వెళ్లి భక్తి శ్రద్దలతో పలు పూజలు చేసి భక్తి చింతనలో మునిగితేలారు. అంతేకాకుండా పలు ముడుపులు కట్టి తమ కోరికలు కోరుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘పవిత్రమైన కొత్త సంవత్సరంలో కొల్హాపూర్ మహాలక్ష్మి, కామాఖ్య పవిత్ర శక్తి పీఠాలను సందర్శించినందుకు ఆశీర్వదాలు పొందాము. నా తదుపరి చిత్రాన్ని ప్రారంభిస్తున్నాను... మీ ప్రేమ ఆశీర్వాదాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేస్తుందా.. లేక ఏ హీరోతో నటిస్తుందా? అనే దాని గురించి నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.






