- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ చేతిలో నా బిడ్డా.. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం.. డైరెక్టర్ పోస్ట్ వైరల్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ఆయన పెండింగ్ పెట్టిన సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు.

దిశ, సినిమా: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ఆయన పెండింగ్ పెట్టిన సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈక్రమంలోనే రీసెంట్‌గా ‘హరిహర వీరమల్లు’ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు పవన్ కల్యాణ్. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణలు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ యాక్టర్ బాబి డియోల్ కీలక పాత్ర పోషించారు. ఎన్నో వాయిదాల తర్వాత ఈ మూవీ భారీ అంచనాల మద్య జులై 24న వరల్డ్ వైడ్‌గా రాబోతుంది.
ఇక తాజాగా డైరెక్టర్ జ్యోతికృష్ణ కుమార్తె ఫస్ట్ బర్త్‌డే కావడంతో పవన్ కల్యాణ్‌ను డైరెక్టర్ ఫ్యామిలీ కలిశారు. అందుకు సంబంధించిన ఫొటోను డైరెక్టర్ జ్యోతి కృష్ణ షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘ఇది కేవలం వృత్తిపరమైన జ్ఞాపకం మాత్రమే కాదు.. నా హృదయానికి ఎప్పటికీ దగ్గరగా ఉండే ఫోటో. పవన్ కల్యాణ్ చేతిలో నా కుమార్తె అహానా ఉంది. సహాజంగా కొన్ని ఫొటోలు కథులుగా మారతాయి.. కానీ ఇది నాకు వరం లాంటిది. అలాగే.. మీ పక్కన (పవన్ కల్యాణ్) ‘హరిహర వీరమల్లు’ దర్శకుడిగా నిల్చోవడం అనేది ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. సినిమా గొప్పతనాన్ని, దాని పట్ల చూపించాల్సిన నిబద్ధతను తెలిపి, నాలో స్ఫూర్తి నింపిన వ్యక్తి ఆయన.. నా జీవితాతం ఈ జ్ఞాపకాలు గుర్తిండిపోతాయి’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు డైరెక్టర్.






