- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"మన శంకరవర ప్రసాద్ గారు" సినిమాలో ఆ హీరోయిన్ కూతురు ?
చిరంజీవి కొడుకు పాత్రలో పోషించింది ఉహ అనే అమ్మాయి అంటూ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్ లో నడుస్తోంది. రెండు రోజుల్లోనే రూ.122 కోట్ల వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. మరో వారం రోజులపాటు కలెక్షన్ల వర్షం కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఓ కన్నడ వాడిగా ఈ సినిమాలో మెరుస్తారు. నయనతారను రెండో పెళ్లి చేసుకునేందుకు కూడా వచ్చి సందడి చేస్తారు.
మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో కొడుకు పాత్ర ?
మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ఇద్దరు పిల్లల తండ్రిగా చిరంజీవి కనిపిస్తారు. ఇందులో ఒక కూతురు ఉండగా ఒక అబ్బాయి ఉంటాడు. అయితే ఇందులో చిరంజీవి కొడుకు పాత్రలో పోషించింది ఉహ అనే అమ్మాయి అంటూ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. వాస్తవంగా సినిమాలో విక్కీ అనే పాత్రలో ఈ ఉహ అనే అమ్మాయి కనిపిస్తుంది. సినిమా చూసిన వాళ్ళందరూ ఉహను అబ్బాయే అనుకుంటారు. అయితే ఈ ఉహ ఫేస్ కట్ టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ తరహాలోనే ఉంది. దీంతో నివేదాకు కూతురు పుడితే ఉహ లాగానే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.






