- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్నప్పకు రివ్యూ ఇస్తే డబ్బులు.. లైవ్‌లో జర్నలిస్ట్ ఆవేదన
కన్నప్ప సినిమా బాగుందని రివ్యూ ఇస్తే ఎంత తీసుకున్నావ్ అంటూ ప్రశ్నిస్తున్నారని ఓ జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశాడు. కన్నప్ప సినిమా ప్రెస్ మీట్‌కు పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: కన్నప్ప సినిమా బాగుందని రివ్యూ ఇస్తే ఎంత తీసుకున్నావ్ అంటూ ప్రశ్నిస్తున్నారని ఓ జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశాడు. కన్నప్ప సినిమా ప్రెస్ మీట్‌కు పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు. అందులో ఒకరు నేరుగా హీరో మంచు విష్ణుతో మాట్లాడుతూ.. కన్నప్ప సినిమా బాగుందని తాను రివ్యూ ఇస్తే కొంతమంది ఎంత తీసుకున్నావ్ అంటూ ప్రశ్నిస్తున్నారని.. మీరు నాకు ఎంత ఇచ్చారని సమావేశంలోనే అడిగారు. చెక్ ఇచ్చారా.. డబ్బులు ఇచ్చారా అని ప్రశ్నించారు. దీంతో విష్ణు ఏం ఇవ్వలేదని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
మంచి సినిమా వచ్చినప్పుడు మీడియా సపోర్ట్ చేస్తుందని జర్నలిస్ట్ అన్నారు. అలాంటి మీడియాపై ఎంత తీసుకున్నారు అంటూ ఎదవ కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్లు కష్టపడి సినిమా తీస్తే వాళ్లపై నెగిటివ్ కామెంట్లు ఎందుకు అని ప్రశ్నించారు. సినిమా చేసిన తరవాత రివ్యూలు ఇస్తే తమపై ట్రోలింగ్ ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని ట్రోలింగ్ చెడగొడుతుందని అన్నారు. సినిమాలో ఎలాంటి నెటిగివ్ అంశాలు లేవని, ఒక మంచి సినిమా తీశారని చెప్పారు. తమపై కామెంట్లు చేసినా పర్లేదు కానీ మంచి సినిమాపై కూడా ట్రోల్స్ చేయవద్దని మండిపడ్డారు.






