ఎన్నో ఎమోషన్స్ రన్ అవుతున్నాయి.. వైరల్‌గా జయకృష్ణ ఘట్టమనేని కామెంట్స్

by Chukka Sudharani |

శ్రీనివాస మంగాపురం సినిమా టీజర్‌పై ఎమోషనల్ కామెంట్స్ చేశాడు యువ హీరో జయకృష్ణ ఘట్టమనేని.

ఎన్నో ఎమోషన్స్ రన్ అవుతున్నాయి.. వైరల్‌గా జయకృష్ణ ఘట్టమనేని కామెంట్స్
X

దిశ, సినిమా: 'RX 100'తో టాలీవుడ్ ఇండస్ట్రీలో పర్‌ఫెక్ట్ మార్క్ సొంతం చేసుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి తన రెండొవ చిత్రంగా ‘శ్రీనివాస మంగాపురం’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని వెండితెరకు హీరోగా పరిచయం అవుతుండటం విశేషం. అలాగే బాలీవుడ్ యంగ్ బ్యూటీ రాషా తడాని తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను మహేశ్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రిలీజ్ చేయగా.. నెట్టిం మంచి స్పందన లభించింది. దీనిపై జయకృష్ణ ఘట్టమనేని తాజాగా స్పందిస్తూ.. ‘మన సినిమా ‘శ్రీనివాస మంగాపురం టీజర్ మా బాబాయ్ మహేశ్ బాబు ద్వారా రిలీజ్ అయింది. నేను చాలా ఎగ్జైట్ అవుతున్నా.. టీజర్ బాగా వచ్చింది. మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు అని నేను నమ్ముతున్నా. ఇది నా మొదటి చిత్రం. ఇప్పుడు ఎన్నో ఎమోషన్స్ నాలో మెదులుతున్నాయి. థియేటర్స్‌కు వచ్చి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా’ అని తెలిపాడు.

Next Story