- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్ఎక్స్ 100 డైరెక్టర్‌తో సూపర్ స్టార్ మనవడు.. ఇట్స్ అఫీషియల్
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి మరొకరు నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు గట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం కాబోతున్నాడంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా దానిపై అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది.

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి మరొకరు నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు గట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం కాబోతున్నాడంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా దానిపై అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శతకత్వం జయకృష్ణ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అశ్విని దత్ వైజయంతి మూవీస్ ఈ సినిమాను ప్రెసెంట్ చేస్తుండగా చందమామ కథలు బ్యానర్ పై పి. కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు.
కృష్ణతో అశ్విని దత్ అగ్నిపర్వతం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరెక్కించారు. అంతే కాకుండా మహేశ్ బాబును ఆయనే ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పుడు జయకృష్ణ కూడా అదే బ్యానర్ తో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. తాజాగా చిత్రయూనిట్ సినిమా అనౌన్సింగ్ పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ లో బ్యాగ్రౌండ్ లో తిరుమల ఆలయం కొండలు కనిపిస్తున్నాయి. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
READ MORE .....
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో.. సినిమా పోస్టర్ రిలీజ్!






