- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆడిషన్ పేరుతో హోటల్ రూమ్‌కు పిలిచి బంధించిన డైరెక్టర్.. పాడుపని చేసేందుకు ప్రయత్నం.. హీరోయిన్ సంచలనం
ప్రముఖ హిందీ టెలివిజన్ హీరోయిన్ జాస్మిన్ భాసిన్.. తన నటనతో బుల్లితెర ప్రేక్షకుల మనసును దోచుకుంది. బిగ్ బాస్‌కు ఎంటర్ అయ్యాక తన క్యారెక్టర్‌తో అభిమానులను మరింత మెప్పించిన బ్యూటీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్‌కు సంబంధించిన

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ హిందీ టెలివిజన్ హీరోయిన్ జాస్మిన్ భాసిన్.. తన నటనతో బుల్లితెర ప్రేక్షకుల మనసును దోచుకుంది. బిగ్ బాస్‌కు ఎంటర్ అయ్యాక తన క్యారెక్టర్‌తో అభిమానులను మరింత మెప్పించిన బ్యూటీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్‌కు సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ పంచుకుంది. ఓ డైరెక్టర్ తనను కాస్టింగ్ పేరుతో హోటల్ రూమ్‌కు పిలిచాడని.. తాగి ఉన్న అతను ఓ సీన్ చేయమని సూచించాడని తెలిపింది. సీన్ చేస్తుండగానే.. అలా కాదు ఇలా అంటూ తనను పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడని వివరించింది. అప్పటికే అక్కడ ఉన్న కోఆర్డినేటర్ తనను ఆయనతో లోపలే బంధించి.. రూమ్ బయట నుంచి లాక్ చేశాడని చెప్పింది. తనకు మరింత భయమేసిందని.. అక్కడి నుంచి ఎలాగైనా ఎస్కేప్ కావాలని అనుకున్నానని చెప్పింది.
మొత్తానికి తన స్కిల్స్‌తో బయటపడ్డానని తెలిపిన ఆమె.. ఇకపై హోటల్ రూమ్స్‌కు ఆడిషన్ పేరుతో పిలిస్తే వెళ్లకూడదని డిసైడ్ అయినట్లు చెప్పింది. ఇప్పటికే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కొనసాగుతుందని.. కానీ సినిమాలను సీరియస్‌గా తీసుకునేవాళ్లు ఇలా చేయరని తెలిపింది. ఏదేమైనా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించింది.






