- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరోయిన్‌కు ఇల్లు గిఫ్ట్‌గా ఇచ్చిన ఖైదీ.. ఏకంగా అమెరికాలో..
హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్-సుఖేష్ చంద్రశేఖర్ ప్రేమాయణం గురించి ఎన్ని స్టోరీలు రాసినా తక్కువే. జైలులో ఉంటూనే ఎన్నో ప్రేమ లేఖలు రాసి.. ఎన్నో కాస్ట్‌లీ గిఫ్ట్‌లు ఇచ్చిన సుఖేష్.. జాక్వెలిన్ అభిమానులకు కూడా ఐఫోన్స్ కొనివ్వడం విశేషం

దిశ, సినిమా : హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్-సుఖేష్ చంద్రశేఖర్ ప్రేమాయణం గురించి ఎన్ని స్టోరీలు రాసినా తక్కువే. జైలులో ఉంటూనే ఎన్నో ప్రేమ లేఖలు రాసి.. ఎన్నో కాస్ట్‌లీ గిఫ్ట్‌లు ఇచ్చిన సుఖేష్.. జాక్వెలిన్ అభిమానులకు కూడా ఐఫోన్స్ కొనివ్వడం విశేషం. అయితే తాజాగా ఆమెకు క్రిస్మస్ కానుకగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెల్స్ కౌంటీలో ఉన్న బెవర్లీ హిల్స్‌లో కొత్త ఇల్లు బహుమతిగా ఇచ్చినట్లు లేఖ రాశాడు. ఆ ఇంటికి ‘The Love Nest’ అని పేరు పెట్టానని.. అది వారు కలిసి ఉండబోయే ఇల్లు అని తెలిపాడు. ఈ విషయం ప్రస్తుతం మీడియాలో సంచలనంగా మారింది. ఇక జాక్వెలిన్ ఈ కేసులో గతంలో విచారణలు ఎదుర్కొంది. సుఖేష్ లేఖలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె ఈ బహుమతులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి కానీ ఆమె ఖండించింది. అయితే వీరిద్దరి ప్రైవేట్ ఫొటోలు లీక్ కావడం అనుమానాలు రేకెత్తించాయి.






