- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Janhvi Kapoor: ‘ఆ రాత్రి 7 గంటలు నిద్ర లేకుండా మూడు రోజులు రాత్రంతా రిహార్సల్ చేశాను’.. బాలీవుడ్ బ్యూటీ ఆసక్తికర పోస్ట్
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ () గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ధడక్ అనే హిందీ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి.. మంచి పేరు సంపాదించుకుంది. ఈమె దివంగత స్టార్ సీనియర్ నటి శ్రీదేవి (Sridevi)కుమార్తె అన్న విషయం తెలిసిందే. తర్వాత ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా ది కార్లిల్ గర్ల్..
అంగ్రేజీ మీడియం, రూహి(Ruhi), గుడ్ లక్ జెర్రీ (Good luck Jerry), మిలి, బవాల్, రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Kii Prem Kahani), తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఘా జియా (Teri Baton Mein Aisa Ulgha Zia), మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉలాజ్ వంటి సినిమాల్లో నటించి ఈ హీరోయిన్ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది.
పింక్‌విల్లా స్టైల్ ఐకాన్స్ అవార్డులు, జీ సినీ అవార్డులు, లోక్‌మత్ స్టైలిష్ అవార్డులు (Lokmat Stylish Awards), బాలీవుడ్ హంగామా స్టైల్ చిహ్నాలు, పింక్‌విల్లా స్క్రీన్ అండ్ స్టైల్ ఐకాన్స్ అవార్డులు వంటివి సొంతం చేసుకుంది. ఇక కొరటాల శివ (Koratala Shiva)దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రంతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట్లో విమర్శలు ఎదుర్కోన్న తర్వాత మంచి టాక్ సొంతం చేసుకుంది. ‘చుట్టమల్లె చుట్టేశావే’ సాంగ్‌తో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు.
అయితే హార్దిక్ మెహతా (Hardik Mehta) దర్శకత్వం వహించిన రూహి చిత్రం నేటితో 4 సంవత్సరాలు పూర్తి చేసకుంది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ రూహి మూవీ వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. నేను ఫస్ట్ టైమ్ సోలో డ్యాన్స్ చేశాను. నేను చాలా చిన్నదాన్ని కూడా. ఈ పాట గురించి చాలా భయపడ్డాను. కఠినమైన లైట్ల కింద కళ్లు తెరిచి ఉంచడం కూడా నేర్చుకోలేదు. గుడ్‌లక్ జెర్రీ షూటింగ్ మధ్య 3 రోజులు రిహార్సల్ చేశాను.
రాత్రంతా పాటియాలాలో జీఎల్‌జే కోసం షూటింగ్ చేశాను. ఉదయం ప్యాక్ అప్ తర్వాత విమానంలో ప్రయాణించాను. ఆ రాత్రి 7 గంటలు నిద్ర లేకుండా పాటను పూర్తి చేసాను. 3 రోజుల నిద్ర లేకున్నా మారథాన్, నేను కెమెరా ముందు ఉత్సాహంగానే ఉన్నాం. ఈ దుస్తులను మెరిసే కవచంలో నా రాత్రికి చివరి నిమిషంలో తీరని కాల్ తర్వాత ఒక రోజులో తయారు చేయడం సరదాగా అనిపించింది. హెయిర్ మేకప్ డ్యాన్స్ వార్డ్‌రోబ్ ప్రతిదీ ఇన్స్పో ప్రతీది ఐకానిక్’’ అంటూ జాన్వీ కపూర్ రాసుకొచ్చింది.






