Janhvi Kapoor: మగవారిని ఉద్దేశించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన జాన్వీ కపూర్.. అణు యుద్ధాలే జరుగుతాయంటూ

by Mallepaka Hamsa |

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

Janhvi Kapoor: మగవారిని ఉద్దేశించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన జాన్వీ కపూర్.. అణు యుద్ధాలే జరుగుతాయంటూ
X

దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఎన్టీఆర్(NTR) ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో జాన్వీకి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ జాన్వీ టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు సనా(Buchibabu Sana) కాంబోలో రాబోతున్న ‘పెద్ది’ (peddi)లో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమాలోంచి విడుదలైన పోస్టర్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ మగవారిని ఉద్దేశించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ‘‘నాకు పీరియడ్స్ వచ్చిన సమయంలో విపరీతమైన మూడు స్వింగ్స్ వస్తాయి. నా మాట తీరును భట్టి నేను పీరియడ్స్‌లో ఉన్నాను అని ఎదుటి వారికి అర్థం అయిపోతుంది. నేను చిరుకుగా కనిపించేసరికి నీకు ఇది ఆ సమయమా అని అడుగుతారు. అలా అడిగే విధానం వల్ల ఒక్కోసారి బాధను కలిగిస్తోంది. కొందరు నా నెలసరి నొప్పి అనేది చాలా చిన్న విషయంగా పరిగణిస్తూ వ్యగ్యంగా మాట్లాడుతారు.

కానీ కొందరు మాత్రం అర్థం చేసుకుని మనకు ప్రశాంతత కలిగేలా ప్రవర్తిస్తారు. రెస్ట్ తీసుకోమని చెప్తారు. అయితే పీరియడ్ నొప్పి అనుభవించేవారికి మాత్రమే తెలుస్తోంది. ఈ సమయంలో మహిళలు పడే బాధను, ఈ మానసిక స్థితిని అబ్బాయిలు ఒక్క నిమిషం కూడా భరించలేరని కచ్చితంగా చెప్పగలను, ఒకవేళ మగవాళ్లకు పీరియడ్స్ వస్తే ఆ నొప్పికి అణుయుద్ధాలే జరిగేవి కావచ్చు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న స్త్రీలు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story