- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫీలింగ్ సుందరి అంటూ స్టార్ కిడ్ బ్యూటిపుల్ పోస్ట్.. విపరీతంగా ఆకట్టుకుంటోన్న ఫొటోలు
దివంగత శ్రీదేవి డాటర్.. బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు

దిశ, వెబ్ డెస్క్: దివంగత శ్రీదేవి డాటర్.. బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 2018 లో ధడక్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తల్లికి తగ్గ కుమార్తెగా పేరు సంపాదించుకుంది. రొమాంటిక్ డ్రామా బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. తర్వాత గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ లో టైటిల్ ఏవియేటర్ పాత్ర పోషించినందుకు.. మిలి సినిమాలో ఫ్రీజర్లో చిక్కుకున్న మహిళ పాత్రకు ఆమె ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డుకు నామినేషన్లు అందుకుంది.
ఇక గత ఏడాది ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ సరసన అవకాశం కొట్టేసిన జాన్వీ కపూర్ దేవర చిత్రంలో అద్భుతంగా నటించింది. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. 'చుట్టమల్లె సాంగ్' కు అయితే భారీ రెస్పాన్స్ లభించిందని చెప్పుకోవచ్చు.
అలాగే ఈ ముద్దుగుమ్మ పరమ్ సుందరి చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రాతో నటించే అవకాశం కూడా సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే.. జాన్వీ కపూర్ తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది తాజాగా ఈ హీరోయిన్ నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. నెత్తిలో మల్లెపువ్వులు, ఆకట్టుకునే నగలు పెట్టుకుని.. లంగావోణిలో జాన్వీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఫిదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.instagram link






