- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
JanaNayagan: సింహం ఎప్పుడూ సింహమే.. విజయ్ సినిమాపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జననాయగన్’.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జననాయగన్’. విజయ్ సినీ కెరీర్‌లో చివరి చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మమిత బైజు, బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా.. తాజాగా సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ మేరకు ‘సింహం ఎప్పుడూ సింహమే.. అలాగే దాని మొదటి గర్జన జూన్ 22 ఉదయం 12 గంటలకు వస్తోంది.. ఫైర్ కోసం సిద్ధంగా ఉండండి’ (JanaNayaganTheFirstRoar) అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ నాయకుడిలా పిడికిలి బిగించి నిలబడగా.. అతని వెనుక ప్రజలు ఉన్నారు. దీంతో ఏ అప్టేడ్ రాబోతుందో అంటూ ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. కాగా.. ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.






