చైనా పీస్ ‘జేమ్స్ బాండ్’ వచ్చేసింది..

by Chukka Sudharani |

అక్కి విశ్వనాథ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’(China Peace).

చైనా పీస్ ‘జేమ్స్ బాండ్’ వచ్చేసింది..
X

దిశ, సినిమా: అక్కి విశ్వనాథ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’(China Peace). మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రంలో నిహాల్ కోధాటి(Nihal Kodhati), సూర్య శ్రీనివాస్(Surya Srinivas) హీరోలుగా నటిస్తుండగా.. కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు. ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్‌ని క్రియేట్ చేసిన ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్.. యూనిక్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్‌, యాక్షన్‌, థ్రిల్, హ్యుమర్ ఎలిమెంట్స్‌తో సినిమాపై అంచనాలు పెంచింది. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా మేకర్స్ ఇందులో నుంచి ‘ఇదేంటో జేమ్స్ బాండ్’ సాంగ్ రిలీజ్ చేశారు. కార్తీక్ రోడ్రిగ్జ్ ఈ సాంగ్‌ని ఎనర్జిటిక్‌గా కంపోజ్ చేశారు. స్ఫూర్తి జితేందర్, హారిక నారాయణ్ వోకల్స్ ఆకట్టుకున్నాయి. దినేష్ కాకర్ల లిరిక్స్ కాన్సెప్ట్‌ని చాలా ఫన్ ఫుల్‌గా ప్రజెంట్ చేశాయి. కాగా.. ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నారు టీమ్.

Next Story