భార్యాభర్తల మధ్యలోకి మూడో వ్యక్తి.. మిస్టరీ థ్రిల్లర్‌గా వదలా టీజర్ గ్లింప్స్

by Chukka Sudharani |

సీనియర్ నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘వదలా’ సినిమా నుంచి టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

భార్యాభర్తల మధ్యలోకి మూడో వ్యక్తి.. మిస్టరీ థ్రిల్లర్‌గా వదలా టీజర్ గ్లింప్స్
X

దిశ, సినిమా : జగపతి బాబు, లయ, హృతిక నటించిన లేటెస్ట్ మూవీ ‘వదలా’. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘నువ్వే నా ప్రపంచం.. ఈ ప్రపంచంలో నువ్వు, నేను అంతే ఇంకెవరు లేరు’ అంటూ జగతిబాబు, లయ కలిసి ఉన్న సీన్‌తో స్టార్ అయిన గ్లింప్స్‌లో.. వీరిద్దరి మధ్యలోకి వేరే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఎలా అయిన యోగి (జగపతి బాబు) సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇక ఈ గ్లింప్స్‌తో ఈ సినిమా యోగి అనే పాత్ర చుట్టూ తిరిగే మిస్టరీ థ్రిల్లర్ అని అర్థం అవుతుంది. ఇంతకీ యోగి ఎవరు, తన కథేంటి? అనేవి చాలా ఇంట్రెస్టింగ్‌గా కట్ చేయడంతో.. సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. కాగా.. ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్, కిశోర్ నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయనే సీన్స్‌తో ఈ సినిమాపై సినీ ప్రేమికుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.

Next Story