చిన్నప్పటి నుంచి ఆయనపై నాకు పెద్ద క్రష్ ఉండేది: భూమి పెడ్నేకర్

by Mallepaka Hamsa |

నేను ఇండస్ట్రీలోకి రాకముందు, చిన్నప్పటి నుంచే ఇమ్రాన్ ఖాన్‌ను చూస్తూ పెరిగాను. ఆయనపై నాకు చాలా పెద్ద క్రష్ ఉండేది.

చిన్నప్పటి నుంచి ఆయనపై నాకు పెద్ద క్రష్ ఉండేది: భూమి పెడ్నేకర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుంటారు. ఇక ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు పదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న లవర్ బాయ్ ఇమ్రాన్ ఖాన్ గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇస్తున్న నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్ ‘అధూరే హమ్ అధూరే తుమ్’ లో భూమి పెడ్నేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం గురించి, ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి భూమి పెడ్నేకర్ రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలు విశేషాలు పంచుకున్నారు. "నేను ఇండస్ట్రీలోకి రాకముందు, చిన్నప్పటి నుంచే ఇమ్రాన్ ఖాన్‌ను చూస్తూ పెరిగాను. ఆయనపై నాకు చాలా పెద్ద క్రష్ ఉండేది. ఆయన నటించిన రొమాంటిక్ సినిమాల్లో ఇమ్రాన్ క్యారెక్టర్స్ ఎంతో పద్ధతిగా, పర్ఫెక్ట్‌గా ఉండేవి. ఈ కాలంలో అలాంటి మంచి లవ్ స్టోరీస్ ఎవరూ తీయడం లేదు. ఈ సినిమా కథ వినగానే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఎంతో పరిణతి చెందిన కథ" అని భూమి ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చారు.

ఇక ఈ సినిమా కథ ఒక వివాహిత జంట మధ్య వచ్చే సమస్యలు, వారి రిలేషన్‌షిప్‌లోని ఇబ్బందుల చుట్టూ తిరుగుతుందని టాక్. కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాకుండా, పెళ్లి తర్వాత బంధాన్ని నిలబెట్టుకోవడంలో ఉండే ఎమోషన్స్, గొడవలను ఇందులో చూపించబోతున్నారట. ఇక ఈ సినిమాకు సంబంధించి ముంబైలో ఒక అదనపు షూటింగ్ షెడ్యూల్‌ను కూడా చిత్ర యూనిట్ ఇటీవల పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను డైరెక్టర్ డానిష్ అస్లాం తెరకెక్కిస్తున్నారు. గతంలో ఇమ్రాన్ ఖాన్, దీపికా పదుకొణె కాంబినేషన్‌లో వచ్చిన ‘బ్రేక్ కే బాద్’ సినిమాను కూడా ఈయనే డైరెక్ట్ చేశారు. అప్పట్లో ఆ మూవీలోని ఎంతో పాపులర్ అయిన ఒక సాంగ్ లైన్ ఆధారంగానే ఇప్పుడు ఈ కొత్త చిత్రానికి ‘అధూరే హమ్ అధూరే తుమ్’ అనే టైటిల్ పెట్టడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు సమాచారం.

Next Story