- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vishal: అతడిని ఎప్పుడు కలిసినా ఆనందమే.. విశాల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
కోలీవుడ్ హీరో విశాల్(Vishal) గత ఏడాది ‘రత్నం’ (Rathnam)చిత్రంతో వచ్చాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో విశాల్(Vishal) గత ఏడాది ‘రత్నం’ (Rathnam)చిత్రంతో వచ్చాడు. ఇక ఆయన నటించిన ‘మదగజరాజా’ (Madagajaraja)సినిమా 12 ఏళ్ల తర్వాత థియేటర్స్‌లోకి వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసు వద్ద పలు రికార్డులు క్రియేట్ చేసింది. అయితే విశాల్ ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నాడు. తాజాగా, ఆయన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని కలిశాడు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ కూడా పెట్టాడు. ‘‘నా ప్రియ స్నేహితుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ్ సేతుపతిని చెన్నై విమానాశ్రయంలో కలిశాను. అతన్ని చూడటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది.
అతను చాలా శక్తివంతంగా ఉంటాడు. నేను అతన్ని కలిసి చాలా కాలం అయింది. కొన్ని నిమిషాలు మాత్రమే అయినా అతనితో మాట్లాడటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ప్రియతమా, నీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు. దేవుడు నిన్ను దీవించును. త్వరలోనే నిన్ను మళ్ళీ చూడాలని ఆశిస్తున్నాను’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వీరిద్దరు ఓ సినిమా చేస్తున్నారని అంతా అభిప్రాయపడుతున్నారు. కాగా, విజయ్ సేతుపతి(vijay sethupathi) టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ చార్మీ నిర్మిస్తోంది. ఇక ఇందులో టబు, రాధికా ఆప్టే కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్.






