బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌ కొడుకుతో సాయిపల్లవి..!

by Disha Web Desk 6 |
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌ కొడుకుతో సాయిపల్లవి..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి అందం, తన డ్యాన్స్‌తో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. డబ్బుకు, అందాలు ఆరబోసే పాత్రలకు దూరంగా ఉంటే సాయిపల్లవి తనకు తగిన పాత్రతోనే హిందీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోందని ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోందట.

యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ తీస్తున్న జునైద్ తొలి మూవీ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. మరో చిత్రం కూడా త్వరలో పట్టాలెక్కబోతోందని, అందులో సాయిపల్లవిని హీరోయిన్‌గా తీసుకోబోతున్నారని తెలుస్తోంది. సాయిపల్లవితో చిత్రబృందం చర్చలు కూడా జరిపినట్లు దానికి ఆమె ఒప్పుకున్నట్లు టాక్. ఇది ఒక ప్రేమ కథా చిత్రమని తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన వారు జునైద్ మొదటి సినిమా విడుదల కాకముందే ఇంత హడావిడి అవసరమా? అని కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు.



Next Story

Most Viewed