- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలాంటి సినిమా చేయాలనేది నా డ్రీమ్.. ప్రశాంత్ నీల్ నుండి ఈ జోనర్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు
మైథాలజీ సబ్జెక్ట్‌తో సినిమా చేయడం తన డ్రీమ్ అని ప్రశాంత్ నీల్ తాజాగా వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తక్కువ సినిమాలకే దర్శకత్వం వహించినప్పటికీ ఆయన తెరకెక్కించిన ప్రతి చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఈయనకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘డ్రాగన్’ అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఇంటర్వ్యూలో భాగంగా “మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా?” అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, “మైథాలజీ సబ్జెక్ట్‌తో ఓ సినిమా చేయడం నా డ్రీమ్. దాని కోసం నేను చాలా సంవత్సరాలుగా ఓ కథను సిద్ధం చేస్తున్నాను” అని తెలిపారు. అలాగే ప్రస్తుతం పలు కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నానని, అవన్నీ పూర్తయ్యాక మైథాలజీ జోనర్‌లో సినిమా చేయాలని భావిస్తున్నట్లు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. సాధారణంగా భారీ యాక్షన్ సినిమాలకు పేరుగాంచిన ప్రశాంత్ నీల్ నుంచి మైథాలజీ మూవీ వస్తే ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






