- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలో ‘పుష్ప-2’ మూవీకి ఇంటర్నేషనల్ క్రేజ్.. మెగా హీరో రియాక్షన్ ఏంటంటే? (ట్వీట్)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న(Rashmika Mandanna) కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ పుష్పకు సీక్వెల్‌గా వచ్చిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న(Rashmika Mandanna) కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ పుష్పకు సీక్వెల్‌గా వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిని సుకుమార్(Sukumar) తెరకెక్కించగా.. జగపతి బాబు(Jagapathi Babu), రావు రమేష్(Rao Ramesh), జగదీష్, సునీల్, అనసూయ(Anasuya), ఫాహద్ ఫాజల్ కీలక పాత్రలో కనిపించారు. దీనికి మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై తెరకెక్కించారు. అయితే ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్స్‌లోకి వచ్చింది. ‘పుష్ప-2’ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ రీ లోడెడ్ వెర్షన్ జోడించడంతో ‘పుష్ప-2’ ప్లస్ పాయింట్‌గా మారింది. ఏకంగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1850 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా జనవరి 30న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సినీ సెలబ్రిటీలు మనసులు గెలుచుకుంటోంది. అలాగే ఇంటర్‌నేషనల్ లెవెల్‌లో ఆదరణను దక్కించుకుంది. ఏకంగా ఈ సినిమా ఏడు దేశాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. తాజాగా, దీనిపై అల్లు శిరీష్ ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. ‘‘పుష్ప 2 చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆదరిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతగా పరిచయం లేని ప్రేక్షకుల నుండి కూడా పిచ్చి ప్రేమను అందుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. వారికి అంతగా పరిచయం లేని ఇలాంటి సినిమాకు మంచి ఆదరణ ఇవ్వడం గొప్ప విషయం’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్‌పై అల్లు అర్జున్ అభిమానులు పుష్పరాజ్‌తో మాములుగా ఉండదని అంటున్నారు.
I am glad the Pushpa 2 is receiving insane love from Western audience as well. Esp for a film like this which is vastly different from their culture or something they're not too familiar with.. @alluarjun @aryasukku @ThisIsDSP @MythriOfficial https://t.co/KprBKRPluw
— Allu Sirish (@AlluSirish) February 4, 2025






