- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Varun Tej: హారర్ కామెడీ చిత్రంతో రాబోతున్న వరుణ్ తేజ్.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన చిత్ర బృందం
మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ఇటీవల ‘మట్కా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ఇటీవల ‘మట్కా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈసారైన హిట్ కొట్టాలి అనుకున్న వరుణ్ ఆశలు నిరాశగానే మిగిలిపోయాయి. ఇదిలా ఉంటే.. వరుణ్ ప్రజెంట్ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల తన బర్త్‌డే సందర్భంగా ‘వీటీ15’ (VT 15) ప్రకటించాడు. ఇండో- కొరియన్ హారర్ కామెడీ (Indo-Korean horror comedy) బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక ఇటీవల వరుణ్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సోషల్ మీడియాలో మంచి స్పందన లభించగా.. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ‘ఇండో-కొరియన్ హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ అయిన #VT15 ప్రీ-ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోంది. తుది కథా చర్చలు అండ్ స్కౌటింగ్ స్థానాల కోసం బృందం ప్రస్తుతం ప్రయత్నాల్లో ఉంది. మార్చి మొదటి వారంలో షూటింగ్ ప్రారంభమవుతుంది’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.
The pre-production of #VT15, an Indo-Korean horror-comedy entertainer is progressing rapidly
— Vamsi Kaka (@vamsikaka) January 29, 2025
The team is currently in Vietnam for the final story discussions and scouting locations
Shoot begins in the First Week of March
Mega Prince @IAmVarunTej @GandhiMerlapaka @MusicThaman… pic.twitter.com/f7j9Wj3Sc9






