- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Prabhas: స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే.. లుక్ టెస్ట్ షూట్‌కు సిద్ధమైన ప్రభాస్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘స్పిరిట్’ (Spirit) ఒకటి.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘స్పిరిట్’ (Spirit) ఒకటి. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. టీ- సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా హై బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే మ్యూజిక్ వర్క్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. కేవలం ప్రకటనలతోనే సినిమాపై హైప్ పెంచేస్తున్న చిత్ర బృందం షూటింగ్‌పై మాత్రం ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడం లేదు. స్పిరిట్ అనౌన్స్ చేసి సంవత్సరాలు గడుస్తున్న సెట్స్ మీదకు రాకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ (Darling fans) కూడా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా.. స్పిరిట్‌కు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వాలంటూ నెట్టింట కామెంట్స్‌తో రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్పిరిట్ షూటింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
ఈ మార్చిలో ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా స్టార్ట్ చెయ్యనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సమ్మర్‌లో రెగ్యూలర్ షూటింగ్ (Regular shooting)కు వెళ్లనున్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి టాక్. అంతే కాకుండా.. తాజాగా ప్రభాస్‌తో లుక్ టెస్ట్ షూట్ గురించి కూడా డైరెక్టర్ సందీప్ డిస్కస్ చేసినట్లు తెలుస్తుండగా.. అతి త్వరలోనే ప్రభాస్ టెస్ట్ కట్ ఉండనుందని టాక్. ఇక ‘స్పిరిట్’ ఫస్ట్ షెడ్యూల్ (First schedule) షూటింగ్‌ను ఇండోనేషియా (Indonesia) రాజధాని జకార్తా (Jakarta)లో ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సందీప్ అక్కడ లొకేషన్ రెక్కీ చేశారట. అంత అనుకున్నట్లు జరిగితే ఈ సమ్మర్‌లో ‘స్పిరిట్’ సెట్స్ మీదకు వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) రావాల్సి ఉంది.






