- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేరుగా ఓటీటీలోకే ఇండియన్ 3..? శంకర్, కమల్ హాసన్ కెరీర్‌కు అగ్నిపరీక్ష..!
ఒకప్పుడు ప్రపంచ సినిమాకు సౌతిండియన్ సినిమా కీర్తిని చాటిన దర్శకుడు శంకర్, ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు ప్రపంచ సినిమాకు సౌతిండియన్ సినిమా కీర్తిని చాటిన దర్శకుడు శంకర్, ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటున్నారు. ఇటీవల విడుదలైన ఇండియన్ 2పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, అది దారుణమైన టాక్‌తో పరాజయం పాలైంది. ఈ దెబ్బ నుంచి కోలుకోకముందే, గేమ్ ఛేంజర్ విషయంలో నెలకొన్న నెగటివ్ ట్రెండ్, ట్రేడ్‌లో శంకర్‌పై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఈ పరిస్థితుల్లో, ఇండియన్ 3 విడుదలపై తీవ్ర అనిశ్చితి నెలకొంది.
శంకర్‌కు తోడు, కమల్ హాసన్ కూడా ఇదే విధమైన కష్టకాలాన్ని అనుభవిస్తున్నారు. ఇండియన్ 2 పరాజయం తర్వాత, మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న థగ్ లైఫ్ సినిమాతో తిరిగి పుంజుకుంటారని భావించారు. కానీ ఇప్పటి వరకు వస్తున్న వార్తల ప్రకారం, ఆ ఆశలు కూడా ఆవిరైనట్లే కనిపిస్తోంది. ఒకవేళ థగ్ లైఫ్ సానుకూల ఫలితం ఇచ్చి ఉంటే, ఇండియన్ 3 దీపావళి లేదా దసరా సీజన్‌లో విడుదలయ్యే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితులు అనుకూలించకపోవడంతో, ఆ ప్రాజెక్ట్ పూర్తిగా హోల్డ్‌లో పడిపోయే ప్రమాదం ఉంది.
అయితే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఇండియన్ 3 థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, బదులుగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌కి నేరుగా అమ్మే ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. శంకర్ బ్రాండ్ విలువ తగ్గడం, కమల్ హాసన్ వరుసగా వాణిజ్యపరంగా వెనుకబడటం ఈ నిర్ణయానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. ఒకవేళ ఓటీటీ రిలీజ్‌కి వెళ్లినా, మంచి డీల్ రాకపోతే సినిమాకు పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవచ్చని ట్రేడ్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






