INCA Awards 2026.. తెలుగు సినిమాలను వరించిన అవార్డులు

by Chukka Sudharani |

ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) 2026 అవార్డుల ప్రదానోత్సవం ముంబయి వేదికగా కన్నుల పండగగా జరిగింది.

INCA Awards 2026.. తెలుగు సినిమాలను వరించిన అవార్డులు
X

దిశ, సినిమా: దేశంలోని అన్ని భాషల సినీ పరిశ్రమలను ఒకే చేటుకు చేర్చుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) 2026 అవార్డుల ప్రదానోత్సవం ముంబయి వేదికగా కన్నుల పండగగా జరిగింది. ఈ మెగా ఈవెంట్‌లో టాలీవుడ్ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి, సీరియర్ నటి శ్రీయ శరణ్‌తో పాటు బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వ్యాఖ్యాలుగా వ్యవహరించారు. ఇక తెలుగు సినీ పరిశ్రమకు ఈ వేడుకలో ప్రత్యేక గుర్తింపు లభించిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ‘తండేల్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాగచైతన్యకు టాలీవుడ్ నుంచి ఉత్తమ నటుడు పురస్కారం దక్కింది. అలాగే ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు రష్మిక మందన్నను వరించింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో ఉత్తమ డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి, అదే చిత్రంలో తనదైన శైలిలో నవ్వించిన మాస్టర్ రేవంత్‌కు ఉత్తమ హాస్యనటుడిగా పురస్కారాలు అందుకున్నారు.

ఉత్తమ నటుడు: నాగచైతన్య (తండేల్)

ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతారా చాప్టర్ 1)

ఉత్తమ నటుడు: దుల్కర్ సల్మాన్ (కాంత)

ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్‌ఫ్రెండ్)

ఉత్తమ నటి: సీనియర్ నటి సిమ్రన్

ఉత్తమ నటి: కళ్యాణి ప్రియదర్శన్

ఉత్తమ డైరెక్టర్: అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)

ఉత్తమ హాస్య నటుడు: చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ రేవంత్ (సంక్రాంతికి వస్తున్నాం)

ఉత్తమ చిత్రం: మిరాయ్

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్: మిరాయ్

ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : రామ్ జగదీష్ (కోర్ట్)

అలాగే భారతీయ సినిమాకు వారు చేసిన విశేష కృషికి గానూ విశ్వనటుడు కమల్ హాసన్, అలనాటి అందాల తార రేఖలకు ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. ఇలా అన్ని విభాగాల్లో తెలుగు సినిమాలకు ఎక్కువ అవార్డులు రావడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు.

Next Story