నాకు అన్ని అలాంటి క్యారెక్టర్సే వస్తున్నాయి.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2025-08-12 14:53:25  IST  )

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’(Coolie).

నాకు అన్ని అలాంటి క్యారెక్టర్సే వస్తున్నాయి.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’(Coolie). మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నాగార్జున(Nagarjuna), శృతి హాసన్(Shruti Haasan), పూజా హెగ్డే(Pooja Hegde)తో పాటు పలువురు స్టార్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘మోనిక’ అనే సాంగ్‌తో అందరి చూపు తనవైపు తిప్పుకుంది పూజా హెగ్డే. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూస్ ఇస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే తనకు వచ్చే పాత్రలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘నార్త్ ఇండస్ట్రీలోని దర్శకులు, నిర్మాతలు నన్ను కేవలం గ్లామర్ పాత్రలకే ఎంపిక చేస్తున్నారు. బహుశా వారు నేను సౌత్ ఇండస్ట్రీలో చేసిన కొన్ని సినిమాలను మాత్రమే చూసి ఉంటారు. కాబట్టి నేను ఏయే పాత్రలు చెయ్యగలనో వారికి నిజంగా తెలియకపోవచ్చు. నాకు రెట్రో(Retro)లో రుక్మిణి పాత్ర ఇచ్చినందుకు కార్తీక్ సుబ్బరాజ్ సర్‌కి ధన్యవాదాలు. నిజంగా ఆ పాత్ర నాకు చాలా నచ్చింది’ అని తెలిపింది. అలాగే.. కాంచన4 (Kanchana 4)లో మీరు నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.. వీటిలో ఎంత వరకు నిజం ఉందనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ప్రస్తుతం నాకు తమిళంలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ఒకటి జననాయగన్(Jananayagan). ఇక ఇంకో సినిమా గురించి చిత్ర నిర్మాణ సంస్థలు అధికారికంగా ప్రకటించే వరకు నేను వాటి గురించి ఏం చెప్పలేను’ అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.

Next Story