- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దొంగతనం చేయాల్సి వస్తే నేను ఆ పని చేస్తా.. శృతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) తనయురాలు శృతి హాసన్(Sruthi Haasan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) తనయురాలు శృతి హాసన్(Sruthi Haasan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మరోవైపు సింగర్‌గా కూడా తన సత్తా చాటుతోంది. ఇక తాజాగా రజినీ కాంత్(Rajinikanth) సరసన ‘కూలీ’(Coolie) మూవీలో నటించి మెప్పించింది. నిన్న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లను సాధిస్తోంది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇంటర్వ్యూలో భాగంగా సుమ(Suma).. శృతి హాసన్‌ను ప్రభాస్ నుంచి ఏదైన దొంగతనం చేయగలిగే అవకాశం వస్తే ఏం చేస్తారని అడిగింది. దానికి శృతి హాసన్ ‘దొంగతనం చేయాల్సి వస్తే.. 'ప్రభాస్' వంట మనిషిని ఎత్తుకు వచ్చేస్తా’ అని చెప్పింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






