- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇదయం మురళి’ రిలీజ్ డేట్ ఫిక్స్..
by Mallepaka Hamsa |
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ పంచుకుంది. ఇప్పటికే షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. విడుదలకు సిద్ధంగా ఉంది.

X
దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అథర్వ మురళి, దర్శకుడు ఆకాష్ బాస్కరన్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఇదయం మురళి’. ఎంతో అందమైన ప్రేమకథతో, ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో అథర్వ సరసన కాయదు లోహర్, ప్రీతి ముకుందన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ పంచుకుంది. ఇప్పటికే షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే జూలై 10న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రేమ ప్రయాణం ఈ జూలైలో థియేటర్లలో ప్రారంభమవుతుందని తెలిపారు.
Next Story






