ఐబొమ్మ రవి నెక్స్ట్ ఎమ్మెల్యే!!

by Sujitha Rachapalli |

* ఐబొమ్మ రవి మాస్ ఫాలోయింగ్ * నెక్స్ట్ ఎమ్మెల్యే అతనే అంటూ కామెంట్స్ * ఆయన చేసింది తప్పో ఒప్పో మాకు తెలియదు * మా పట్ల దేవుడు అతనే అంటూ ఒపీనియన్స్

ఐబొమ్మ రవి నెక్స్ట్ ఎమ్మెల్యే!!
X

దిశ, వెబ్ డెస్క్ : ఐబొమ్మ రవి కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. భార్యతో విడాకుల కోసం విదేశాల నుంచి వచ్చిన అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టడాలు.. సినిమా ఇండస్ట్రీ మీటింగ్స్.. వెంట వెంటనే జరిగిపోయాయి. మొత్తానికి అతనో ఫ్రాడ్ అని.. పెద్ద క్రైమ్ చేశాడని చెప్పారు పోలీసులు. అయితే దీనిపై మధ్య తరగతి జనాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది.. అవుతోంది.

ముఖ్యంగా అసలు అన్ని కోట్లు సినిమాలు పెట్టి మిమ్మల్ని సినిమాలు తీయమన్నది ఎవరు? టికెట్ రేట్లు పెంచి సామాన్యుల నెత్తిపై పెట్టమన్నది ఎవరు? సినిమా రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నప్పుడు జనాలు థియేటర్లకు రావట్లేదని ఫీల్ అవమంటున్నది ఎవరు? హీరోలకు వందల కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వమన్నది ఎవరు? డబ్బులు పోగొట్టుకుని విలపించమన్నది ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. ఫ్యామిలీ థియేటర్‌కు వెళ్తే మినిమమ్ మూడు వేలు ఖర్చు అవుతుంది కదా.. అలాంటప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమా ఎలా చూస్తుంది? ఆ డబ్బులతో నెలకు సరిపోయే సరుకులను కొనుక్కోవచ్చు కదా? అని చెప్తున్నారు. ఆ టైమ్‌లోనే ఐబొమ్మ వచ్చిందని.. మిడిల్ క్లాస్‌ దైవంగా మారిందని అభివర్ణిస్తున్నారు. పైసలు లేవు కాబట్టి ఆ సైట్‌లోకి పోయి ఫ్రీగా మూవీ డౌన్‌లోడ్ చేసుకుని చూస్తున్నామని చెప్తున్నారు.

ఇంకొందరు అయితే ఏకంగా సీపీ సజ్జనార్‌నే ప్రశ్నిస్తున్నారు. సరే ఐబొమ్మ రవి తప్పు చేశాడనే అనుకుందాం.. ఆ సైట్‌ను క్లోజ్ చేసి మంచి పని చేశారనే అనుకుందాం.. ఇండస్ట్రీని కాపాడారనే అనుకుందాం.. మరి ఎంతో మంది సామాన్యుల ప్రాణాలను తీస్తున్న సిగరెట్, మందు కంపెనీలను ఎందుకు క్లోజ్ చేయించలేకపోతున్నారు? వాళ్లు రిచ్ కాబట్టి వాళ్లకు సపోర్ట్ ఉంటారు అంతేనా? ఇండస్ట్రీ పీపుల్ రిచ్ కాబట్టి వాళ్ల బాధ మీకు త్వరగా అర్థమైంది అంతేనా? అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఐబొమ్మ రవి చేసిన దాంట్లో తప్పేమీ లేదని.. సామాన్యులం అందరం సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఆయన తరఫున వాదించే లాయర్‌కు తలా కొన్ని డబ్బులు వేసుకుని ఫీజు చెల్లిస్తామని.. ఆ విధంగా ఆయన ఐబొమ్మ ఫ్రీగా చూసినందుకు కృతజ్ఞతగా భావిస్తామని చెప్తున్నారు. ఆయనకు ఇప్పుడు మాస్ ఫాలోయింగ్ ఎక్కువైపోయిందని.. ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలుపు ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story