- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐబొమ్మ పోయి ఐబొమ్మ వన్ వచ్చింది
ఐబొమ్మ వెబ్ సైట్ ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఐబొమ్మ వన్ అనే పేరుతో ఓ వెబ్ సైట్ వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఐబొమ్మ పేరే వినిపిస్తుంది. సినిమాలను పైరసీ చేసే ఈ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మది రవి అరెస్ట్‌తో ఐబొమ్మ పేరు హాట్ టాపిక్‌గా మారింది. అరెస్ట్ తరవాత పోలీసులకు సవాల్ విసిరిన రవితోనే ఐబొమ్మను క్లోజ్ చేయించారు. అయితే ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐబొమ్మ పేరుతో మరో పైరసీ సినిమాల వెబ్ సైట్ తెరుచుకుంది. ఐబొమ్మ వన్ పేరుతో దీనిని ప్రారంభించారు. అయితే పేరు కాస్త వేరుగా ఉన్నప్పటికీ వెబ్ సైట్ మాత్రం అచ్చుగుద్దినట్టు ఒరిజినల్ ఐబొమ్మ మాదిరిగానే కనిపిస్తోంది.
అంతే కాకుండా ఐబొమ్మలో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే ఉంటే కొత్తగా ప్రారంభించిన ఐబొమ్మ వన్‌లో తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే దీనిని ఇమ్మది రవి అనుచరులు ఎవరైనా ప్రారంభించారా లేదంటే మరెవరైనా ప్రారంభించారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే ఇలాంటి వెబ్ సైట్స్‌లో సినిమాలు చూడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. పైరసీ సైట్స్ లో సినిమాలు చూడటం ద్వారా డేటా కూడా చోరీ చేసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.






