- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా అనుమతి లేకుండా వారిని ఫొటోలు తీస్తే ఊరుకునేది లేదు.. ప్రీతి జింటా వార్నింగ్.. ఎవరిని ఉద్దేశించంటే?
బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా(Preity Zinta) ‘దిల్ సే’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది.

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా(Preity Zinta) ‘దిల్ సే’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. తెలుగులో ఈ అమ్మడు ‘రాజకుమారుడు’(Raja Kumarudu) చిత్రంలో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్స్‌తో పాటు బాలీవుడ్ బడా హీరోలతోనూ నటించి మెప్పించింది. తెలుగు, హిందీ భాషల్లోనే కాకుండా పంజాబీ, ఇంగ్లీష్ వంటి చిత్రాల్లోనూ నటించింది. ఇక ఇటీవల ప్రీతి జింటా ‘లాహోర్’ (Lahore)మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. అలాగే టైమ్ ఉన్నప్పుడల్లా అభిమానులతో చిట్ చాట్ చేస్తోంది. తాజాగా, ప్రీతి జింటా ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో ముచ్చటించింది.
ఇందులో భాగంగా ఫొటోగ్రాఫర్లకు వార్నింగ్ ఇచ్చింది. ఓ నెటిజన్ ‘మీ గురించి తెలియని విషయం ఒకటి చెప్పండి’ అని అడగ్గా.. దానికి ప్రీతి స్పందిస్తూ.. ‘‘ఆలయాలలో, బాత్రూంలో, భద్రతా తనిఖీల సమయంలో ఫొటోలు తీస్తే నాకు కోపం వస్తుంది. ఈ సమయాలలో తప్ప మిగతా సమయంలో ఫొటో అడిగిన, నాతో దిగిన కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ముఖ్యంగా నా పిల్లల ఫొటోలు తీస్తే నాలోని కాళి బయటకు వస్తుంది. నేను ఎంతో సరదా మనిషిని. కానీ నా అనుమతి లేకుండా వీడియోలు తీయొద్దు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా నేరుగా నన్ను అడగండి. దయచేసి నా పిల్లలను వదిలేయండి’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.






