- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు అలాంటి పాత్రలు చేయాలని ఉంది.. టాలీవుడ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యంగ్ బ్యూటీ రీతు వర్మ(Ritu Varma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ రీతు వర్మ(Ritu Varma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక గత ఏడాది ‘స్వాగ్’(Swag) మూవీతో అలరించిన ఈ బ్యూటీ.. ప్రజెంట్ సందీప్ కిషన్(Sundeep Kishan) సరసన ‘మజాకా’(Mazaka) సినిమాలో నటిస్తోంది. స్టార్ డైరెక్టర్ త్రినాధ రావు(Trinadha Rao Nakkina) తెరకెక్కించిన ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ రావు రమేష్(Rao Ramesh), అన్షు(Anshu) కీ రోల్ ప్లే చేస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి ప్రతి అప్డేట్ ఆకట్టుకుని సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. కాగా ఈ మూవీ భారీ అంచనాల నడుమ శివరాత్రి కానుకగా ఈ ఫిబ్రవరి 26న థియేటర్లలోకి రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్ల జోరులో ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రీతూ వర్మ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘నా సినీ ప్రయాణం పట్ల నేను చాలా తృప్తిగా ఉన్నాను. ఎందుకంటే నేనసలే నటి అవ్వాలనే అనుకోలేదు. అలాంటిది నేనిక్కడ దాకా వచ్చి.. ఇన్నేళ్లుగా కొనసాగుతున్నాను. నటిగా చాలా మంచి సినిమాల్లో భాగమయ్యాను.
అందులో చిరకాలం గుర్తుంచుకునే పాత్రలు కొన్ని ఉండటం ఆనందాన్నిస్తోంది. నాకు యాక్షన్ ప్రాధాన్యమున్న పాత్రలు చేయాలని ఉంది. కామెడీ చేయడం కూడా నాకు చాలా ఇష్టం. మజాకా ఒప్పుకోవడానికి కారణం ఇదే. అలాగే పూర్తి స్థాయి పీరియాడిక్ సినిమా చేయాలని ఉంది. ప్రస్తుతం నేను ఓ మల్టీస్టారర్ ప్రాజెక్టుకు ఓకే చెప్పాను. అలాగే ‘శ్రీకారం’ ఫేమ్ కిషోర్(Kishore) డైరెక్షన్‌లో ఓ వెబ్ సిరీస్ చేశా. అది త్వరలో హాట్ స్టార్(Hot Star)లో స్ట్రీమింగ్ కానుంది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






