- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను బిజీగా జీవిస్తున్నాను.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్
యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా(Rashi Khanna) ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా(Rashi Khanna) ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇటీవల ఈ చిన్నది స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu Kada) మూవీలో నటించి మెప్పించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఓకే ఓకే అనిపించుకున్నప్పటికీ ఈ భామ యాక్టింగ్‌కు మాత్రం ఫుల్ మార్కులే పడ్డాయి.
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Usthad Bhagat Singh) మూవీలో నటిస్తోంది. దీనికి హరీష్ శంకర్(Hareesh Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ క్రమంలో తాజాగా రాశీ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘నేను చాలా బిజీగా జీవిస్తున్నాను’ అంటూ షూటింగ్, జిమ్‌లో కష్టపడుతున్న ఫొటో, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో, మేకప్ వేసుకుంటూ ఫోన్‌లో మాట్లాడుతున్న ఫొటోలను షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. మరి దీన్ని చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అప్డేట్ కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.






