వారిపై కఠినాత్మక చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.. కన్నీళ్లు పెట్టిస్తున్న నితిన్ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

by Gugulothu.Kavitha |

‘హార్ట్ ఎటాక్’(Heart Attack) మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ అయిన ఆదాశర్మ(Adah Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వారిపై కఠినాత్మక చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.. కన్నీళ్లు పెట్టిస్తున్న నితిన్ హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘హార్ట్ ఎటాక్’(Heart Attack) మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ అయిన ఆదాశర్మ(Adah Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్(allu Arjun) నటించిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ (Son Of Satyamurthy) చిత్రంలో నటించి మెప్పించింది. అయితే తెలుగులో అనుకున్నంత పాపులారిటీ దక్కలేదు. దీంతో ప్రజెంట్ బాలీవుడ్‌కి చెక్కేసి అక్కడ వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిపై భారతీయుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ దాడి ఘటనలో పాక్ హస్తం ఉందని ప్రాథమిక దర్యాప్తులో తెలియడంతో గతంలో లాగా దాయాదిపై సర్జికల్ స్ట్రైక్ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఉగ్రదాడిని యావత్ భారత చిత్రసీమ ముక్త కంఠంతో ఖండించింది. టాలీవుడ్ టు బాలీవుడ్ అందరూ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఆదా శర్మ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అందులో.. ‘పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి నన్ను తీవ్ర విచారంలో, నిస్సహాయంగా వదిలివేసింది. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల కోసం నా హృదయం విలపిస్తోంది.

వారి దుఃఖం ఊహించలేనిది, వారి బాధ పదాలు తాకలేనిది. ఉగ్రవాదులపై త్వరిత మరియు నిర్ణయాత్మక చర్య తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను, అది వారిని శిక్షించడమే కాకుండా స్పష్టమైన బలమైన సందేశాన్ని కూడా పంపుతుంది, అలాంటి చర్యకు పాల్పడాలని ఆలోచించే ఎవరికైనా భయాన్ని కలిగిస్తుంది. మీడియా ఛానెల్‌లు నన్ను ఒక కోట్ ఇవ్వమని మరియు నేను ఎలా భావిస్తున్నానో వ్యక్తపరచమని లేదా న్యూస్ ఛానెల్ చర్చలకు వెళ్లమని అడుగుతున్నాయి. నా విచారం మరియు కోపాన్ని మాటల్లో పెట్టడం నాకు చాలా కష్టం. ప్రార్థన మాత్రమే నాకు ఉన్న ఏకైక ఎంపిక. కాబట్టి.. ఈ వారాంతంలో (త్వరలో సమయాన్ని పంచుకుంటూ) పాల్ఘామ్ ఉగ్రవాద దాడి బాధితుల కోసం భగవత్ గీతను ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పఠించడం జరుగుతుంది. వీలైన వారు దయచేసి చేరండి’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story