- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నప్పటి నుంచి నా కాళ్ల మీద నేను నిలబడ్డాను.. రౌడీ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం ‘కింగ్డమ్’(Kingdom) మూవీతో పాటు ‘వీడీ-14’(VD-14) చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం ‘కింగ్డమ్’(Kingdom) మూవీతో పాటు ‘వీడీ-14’(VD-14) చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు. కింగ్డమ్ మూవీఈ నెల 31న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా పేరెంట్స్ నన్ను బోర్డింగ్ స్కూల్‌లో వేశారు. అలా అయిదేళ్ల నుంచే నేను అమ్మ నాన్న లేకుండా బతకడం నేర్చుకున్నాను.
నేను ఫస్ట్ టైం గొడవ పడ్డప్పుడు అవతలి వ్యక్తి కంటే తక్కువ దెబ్బలతో వచ్చాను. నాకు సమస్యలు వచ్చినప్పుడు మా నాన్నను తీసుకెళ్లకుండా నేనే ఎదుర్కొన్నాను. నా కెరీర్‌లో కూడా నేను ఎలాంటి గైడెన్స్ లేకుండా నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా విజయ్ దేవరకొండ చిన్నప్పటి నుంచి పుట్టపర్తి శ్రీ సత్యసాయి స్కూల్‌లో అక్కడే హాస్టల్‌లో ఉండి చదువుకున్న సంగతి తెలిసిందే.






