- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాలా ఉత్తేజకరమైన దాని కోసం డబ్ చేశాను.. రాశీ ఖన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్
యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా(Rashi Khanna) ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా(Rashi Khanna) ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇటీవల ఈ చిన్నది స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(telusu Kada) మూవీలో నటించి మెప్పించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఓకే ఓకే అనిపించుకున్నప్పటికీ ఈ భామ యాక్టింగ్‌కు మాత్రం ఫుల్ మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Usthad Bhagat Singh) మూవీలో నటిస్తోంది.
దీనికి హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.ఇదిలా ఉంటే.. నిత్యం సోషళ్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో తాజాగా రాశీ పోస్ట్ చేసిన పోస్ట్ చేసిన స్టోరీ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
షేర్ చేసిన స్టోరీలో రాశీ సీరియస్‌గా ఏదో మూవీకు డబ్బింగ్ చేప్తుంది. ఇక డబ్బింగ్ స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్న పిక్‌ను షేర్ చేస్తూ.. ‘చాలా ఉత్తేజకరమైన దాని కోసం డబ్ చేసాను - త్వరలో వస్తుంది.. అయితే ఇది చాలా కష్టమైన రోజు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. మరి దీన్ని చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకే డబ్బింగ్ చెబుతుందని కామెంట్స్ చేస్తున్నారు.






