Bellamkonda Sai Srinivas: సినిమాలు చేయకూడదనుకున్నాను.. టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-24 15:17:45  IST  )

బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్, నారా రోహిత్(Nara Rohit) మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెల్తుతోంది.

Bellamkonda Sai Srinivas: సినిమాలు చేయకూడదనుకున్నాను.. టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్, నారా రోహిత్(Nara Rohit) మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెళ్తోంది. విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30న సమ్మర్ సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘‘నాకు కమర్షియల్ హీరోగా మంచి పేరు వచ్చింది. తర్వాత కొన్ని స్టైలిష్ సినిమాలు చేయడం జరిగింది. అప్పుడు మాస్ కనెక్ట్ అవుతున్నారా లేదా అనే ఆలోచన ఉండేది.

అందరూ రిలేట్ చేసుకునే ఒక రూరల్ స్టోరీ చేయాలని ఉండేది. అలాంటి సినిమా కోసం చూస్తున్నప్పుడు ఈ కథ దొరికింది. ఈ కథని మన సెన్సిబిలిటీస్‌కి తగ్గట్టు ప్రజెంట్ చేయగల దర్శకుడు విజయ్ గారు అనిపించింది. డైరెక్టర్ తెలుగు ఆడియన్స్‌కు తగ్గట్టు అన్ని మార్పులు చేసి చాలా అద్భుతంగా సినిమాని తీర్చిదిద్దారు. ఇది అందరూ రిలేట్ అయ్యే ఎమోషన్స్‌తో ఉంటుంది. రోహిత్, మనోజ్, ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. కథకి వారిద్దరూ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యారు. నన్ను ఇష్టపడిన ప్రతి ఆడియన్ కోసం భైరవం సినిమా చేశాను. తప్పకుండా ఈ మూవీ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.

ఆడియన్స్ చాలా మంచి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఫీల్ అవుతారు. ఇందులో రెండు డ్యాన్స్ సాంగ్స్ ఉన్నాయి. గిచ్చమాకే సాంగ్ పర్ఫెక్ట్ ఫెస్టివల్ వైబ్‌తో ఉంటుంది. అలాగే మరో డ్యాన్స్ నెంబర్ కూడా ఉంది. హైందవ స్క్రిప్ట్ ఓకే చేసి దాదాపు మూడేళ్లు అవుతుంది. అది నాకు చాలా పాషనేట్ ప్రాజెక్టు. హైందవ, టైసన్ నాయుడు తర్వాత ఇంకేది చేయకూడదు అనుకున్నాను. ఈ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు అనుకోకుండా భైరవం, కిష్కింధపురి వచ్చాయి. ఈ రెండు ప్రాజెక్టులు కూడా నాకు చాలా ఎక్జైట్ చేశాయి. ‘కిష్కింధపురి’ చాలా కొత్త జోనర్ సినిమా. ఆడియన్స్‌కు చాలా మంచి ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది.

Next Story