- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను ఇంత అందంగా ఉండటం కోసం డైలీ మార్నింగ్ ఆ పని చేస్తాను.. తమన్నా కామెంట్స్ పై ఛీ వాక్ అంటున్న నెటిజన్లు
మిల్క్ బ్యూటీ తమన్నా(Tamannah) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: మిల్క్ బ్యూటీ తమన్నా(Tamannah) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక రీసెంట్‌గా ‘ఓదెల-2’(Odela-2) మూవీతో మన ముందుకు వచ్చిన ఈ చిన్నది అనుకున్నంతగా విజయం సాధించలేదు. అయితే ఈ భామ బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ నెట్టింట సెన్సేషన్‌గా అవుతుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్, వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఇదిలా ఉంటే.. తమన్నా చాలా తెల్లగా గ్లామరస్‌గా మిల్క్ బ్యూటీలా ఉంటుంది. ఫేస్ మీద ఒక్క పింపుల్ మార్క్ లేకుండా చాలా నీట్ అండ్ క్లియర్ స్కిన్‌తో ఉంటుంది. అయితే ఇలా తను ఇంత అందంగా ఉండటానికి రోజు ఓ టిప్ ఫాలో అవుతానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. మీరు మొటిమలు తగ్గించుకోవడానికి ఏం చేస్తారు?" అని యాంకర్ అడగగా.. దీనికి తమన్నా స్పందిస్తూ.." ఉదయం లేవగానే బ్రష్ చేయకముందే నా నోటిలో ఉండే సలైవా(ఉమ్మి ) మొటిమలపై రాసుకుంటాను. అవి క్రమంగా తగ్గిపోతాయి.
ఇది నాకు వ్యక్తిగతంగా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా దీని వెనుక సైన్స్ కూడా ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఉదయం లేవగానే వచ్చే సలైవా (ఉమ్మి)లో యాంటీ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మొటిమలను, మొటిమల తాలూకు మచ్చల్ని కూడా తొలగిస్తుంది" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఛీ ఉమ్మి ఫేస్‌కి రాసుకోవడం ఏంటి అని కొంత మంది అసహ్యించుకుంటుంటే.. మరికొంత మంది మాత్రం మచ్చలు పోవడానికి వేలల్లో ఖర్చు చేయడం కంటే ఇది చాలా బెటర్ కదా అంటూ ఆమెకు సపోర్టీవ్‌గా మాట్లాడుతున్నారు.






