- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బు, ఫేమ్ కోసం బోల్డ్ వీడియో విడుదల చేయలేదు.. బుద్ధిలేక వదిలానంటూ స్టార్ కిడ్ ఎమోషనల్ పోస్ట్
తాను డబ్బు కోసం, పబ్లిసిటీ కోసమే ఇలా చేశానని దారుణంగా మాట్లాడుతున్నారని, కానీ తనకు అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.

దిశ, సినిమా: ఇటీవల కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు డబ్బు, ఫేమ్ కోసం తమ బోల్డ్ ఫొటోలు, వీడియోలతో నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ద్వారా బోల్డ్ కంటెంట్ చూడటానికి నెలకు రూ. 299 వసూలు చేసే సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు ఇదే బాటలో కోలీవుడ్ స్టార్ నటుడు కృష్ణ కుమార్ కూతురు, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ హన్సిక కృష్ణ కూడా తన సబ్‌స్క్రిప్షన్ ధరను రూ. 399కి పెంచుతూ ఒక బోల్డ్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో.. "డబ్బు కోసం ఇంత దిగజారాలా?" అంటూ నెటిజన్లు ఆమెపై దారుణంగా విమర్శలు గుప్పించారు. ఇక ఈ వివాదంపై హన్సిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. బుద్ధిలేక ఆ వీడియోను పోస్ట్ చేశానని, అందుకు తనను క్షమించాలని కోరింది. అసలు ఆ వీడియోను ఎందుకు పోస్ట్ చేశానో తనకే అర్థం కావడం లేదని, తన వల్ల పెద్ద తప్పు జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.
తాను వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసినప్పటికీ, కొందరు దాన్ని రికార్డ్ చేసి సోషల్.. మీడియాలో వైరల్ చేశారని తెలిపింది. తాను డబ్బు కోసం, పబ్లిసిటీ కోసమే ఇలా చేశానని దారుణంగా మాట్లాడుతున్నారని, కానీ తనకు అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. గత 20 ఏళ్లుగా తన బాగోగులు తనే చూసుకోగలిగేంతగా సంపాదిస్తున్నానని, కాబట్టి పబ్లిసిటీ కోసం పాకులాడాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పింది. ఈ వివాదం వల్ల తాను, తన కుటుంబం మానసికంగా చాలా ఇబ్బంది పడ్డామనితెలిపింది. సోషల్... మీడియాలో వస్తున్న వేధింపులు, బూతు కామెంట్లు తనను తీవ్రంగా బాధిస్తున్నాయని, విమర్శించేవారు హద్దులు దాటుతున్నారని మండిపడింది. కొందరు తమ వ్యూస్ కోసం తన వీడియోను వాడుకుంటున్నారని, మనుషులు అవతలివారిని ఎంత సులభంగా ద్వేషిస్తారో దీనివల్ల తనకు తెలిసొచ్చిందని పేర్కొంది. ఇక సబ్‌స్క్రిప్షన్ ధర పెంచడంపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ, తాను సబ్‌స్క్రిప్షన్ ధరను పెంచింది డబ్బు కోసం కాదని, సబ్‌స్క్రైబర్ల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతోనే అలా చేశానని క్లారిటీ ఇచ్చింది. దీంతో బోల్డ్ వీడియో వివాదానికి చెక్ పడింది.






