- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Samantha: అది సవాలుగా అనుకొని చేశా.. భవిష్యత్తులో యాక్ట్ చేయాలనుకోవట్లే.. సమంత షాకింగ్ కామెంట్స్!

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) మయోసైటీస్ కారణంగా గత కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. చివరగా ఈ స్టార్ బ్యూటీ ‘ఖుషి’ (Kushi)చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత నుంచి ఆమె పూర్తిగా చికిత్స తీసుకోవడానికి సమయం కేటాయించింది. ఇక ఇటీవల సామ్ కాస్త కోలుకోవడంతో సోషల్ మీడియాలో ఫుల్ ఫామ్‌లో ఉంది. పాడ్ కాస్ట్ మొదలెట్టడంతో పాటు నిర్మాతగానూ మారి ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్‌పై ‘శుభం’(shubham) చిత్రాన్ని నిర్మించింది. అయితే ఈ సినిమా మే 9న థియేటర్స్‌లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా కలెక్షన్లు కూడా బాగానే రాబడుతూ దూసుకుపోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నేను సూపర్ డీలక్స్(Super Deluxe) చేస్తున్నప్పుడు, కొందరు నో అన్నారు, మరి కొందరు నన్ను ప్రయోగాలు చేయమని ప్రోత్సహించారని నాకు గుర్తుంది.
మరీ ముఖ్యంగా ‘ఊ అంటావా’ సాంగ్ ఆఫర్ వచ్చినప్పుడు చాలా మంది చేయొద్దని సలహా ఇచ్చారు. నన్ను నేను ఎప్పుడూ ఒక హాట్ గర్ల్‌గా అనుకోలేదు. ఆ విధంగా అస్సలు ఊహించుకోలేదు. అలాంటి సమయంలో ఈ పాట ఆఫర్ వచ్చినప్పుడు ఒక సవాలుగా అనుకొని చేశా. సెట్లోకి అడుగు పెట్టినప్పుడు కూడా కంగారుపడ్డాను మొత్తం నేను వణికిపోయాను. సెట్లో ఉన్న వారిని చూసి భయపడుతుంటే డైరెక్టర్ యాక్షన్ అని చెప్పడంతో ధైర్యంగా సాంగ్ పూర్తి చేశా. సవాలుగా అనుకొని చేశా కానీ మళ్లీ భవిష్యత్తులో అలాంటి పాటల్లో యాక్ట్ చేస్తాను అని అనుకోవడం లేదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సంతోష పడుతుంటే మరికొందరు మాత్రం షాక్ అవుతున్నారు.