- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఛీ అనవసరంగా ఈ స్టార్ క్రికెటర్‌తో డేటింగ్ చేశా.. నా పిల్లలు అడిగితే ఏం చెప్పాలి.. అలనాటి హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
'కర్క కసదారా' ద్వారా అనే తమిళ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అలనాటి హీరోయిన్ రాయ్ లక్ష్మి(Rai Lakshmi) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: 'కర్క కసదారా' ద్వారా అనే తమిళ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అలనాటి హీరోయిన్ రాయ్ లక్ష్మి(Rai Lakshmi) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇక తెలుగులో ఈ చిన్నది ‘కాంచనమాల కేబుల్ టీవీ’(Kanchanamala Cable TV) అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యింది. అప్పట్లో పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో స్టెప్పులేసి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాల స్పీడ్ తగ్గించి సోషల్ మీడియాకే పరిమితమైంది. అయితే రాయ్ లక్ష్మీ కేవలం సినిమాలతోనే కాకుండా, అప్పట్లో భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనితో ఉన్న డేటింగ్ రూమర్స్‌తోనూ వార్తల్లో నిలిచారు.
ఈ క్రమంలో తాజాగా ఈ వార్తలపై స్పందించింది ఈ ముద్దుగుమ్మ. ఆమె మాట్లాడుతూ.. ‘ధోనితో నా సంబంధాన్ని ఒక మచ్చగా భావిస్తున్నాను. భవిష్యత్తులో నా పిల్లలు ఈ విషయం గురించి ప్రశ్నిస్తే నేను ఎలా సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. అయితే గతంలో ధోనితో నాకు సంబంధం ఉందని వచ్చిన వార్తలను తాజాగా మళ్ళీ తవ్వి తీస్తున్నారు, ఇంటర్నెట్‌లో ఈ విషయాలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. అవి నాకు నచ్చడం లేదు. దయచేసి ఈ పిచ్చి ప్రచారాన్ని దూరం పెట్టాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






