- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్త్రీల ఉనికి లేకుండా నేను జీవించలేను.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలంటూ వివాదాస్పద డైరెక్టర్ షాకింగ్ ట్వీట్
వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం సోషల్ మీడియా(Social Media) వేదికగా ఏదో ఒక కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ అవుతూ ఉంటారు.

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం సోషల్ మీడియా(Social Media) వేదికగా ఏదో ఒక కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ అవుతూ ఉంటారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన ‘అమ్మ రాజ్యంలో కడప రెడ్లు’(Amma Rajyamlo Kadapa Redlu) సినిమాకు సంబంధించిన కేసులో ఆర్జీవీకు ఒంగోలు , మంగళగిరి, అనాకాపల్లిలో ఫిర్యాదులు అందిన నేపథ్యంలో సీఐడీ పోలీసులు అతనికి నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే.
ఇక ఇతని సినిమాల విషయానికి వస్తే.. రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ప్రొడక్షన్‌లో LLP బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ(Ravi Shankar Varma) నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శారీ’(Saree). దీనికి గిరి కృష్ణ కమల్(Krishna Kamal) దర్శకత్వం వహిస్తుండగా.. సత్య యాదు(Sathya Yadu), ఆరాధ్య దేవీ(Aaradhya Devi) హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా నిజజీవిత సంఘటన ఆధారాలతో సైకాలజికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. కాగా ఈ మూవీ మార్చి 21కి గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చాలా మంది సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ స్పెషల్ ట్వీట్లు, పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్జీవీ కూడా ఎక్స్(X) వేదికగా ఓ ట్వీట్ పెట్టాడు. అందులో.. ‘నా ఉనికి లేకుండా నేను జీవించగలను, కానీ స్త్రీల ఉనికి లేకుండా నేను జీవించలేను .. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దాన్ని చూసిన నెటిజన్లు రామ్ గోపాల్ వర్మ ఇలాంటి పోస్టులు కూడా పెడతారా అని షాక్ అవుతున్నారు.






