- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘/ఐ యామ్ ఎ ఛాంపియన్’ సాంగ్ లాంచ్ చేసిన సమంత
‘ఛాంపియన్’ నుంచి ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు భారీ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ‘గిర గిర’ సాంగ్ అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండ్ అవుతూనే ఉండగా.. మనసుని కదిలించే సెకండ్ సింగిల్ ‘సల్లంగుడాలే’ అద్భుతమైన స్పందన అందుకుంది. రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం నుంచి తాజాగా మూడో పాటను మేకర్స్ లాంచ్ చేశారు. ఆనంది

దిశ, సినిమా : ‘ఛాంపియన్’ నుంచి ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు భారీ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ‘గిర గిర’ సాంగ్ అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండ్ అవుతూనే ఉండగా.. మనసుని కదిలించే సెకండ్ సింగిల్ ‘సల్లంగుడాలే’ అద్భుతమైన స్పందన అందుకుంది. రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం నుంచి తాజాగా మూడో పాటను మేకర్స్ లాంచ్ చేశారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి స్వప్న సినిమా నిర్మించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పిస్తుండగా.. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. మూడో సింగిల్ ‘ఐ యామ్ ఎ ఛాంపియన్’ సాంగ్ ఒక ప్రత్యేకమైన, పూర్తి స్థాయి డాన్స్ నంబర్‌గా అలరించింది. గ్రాండియర్‌తో పాటు రిథిమిక్ ఎలిగెన్స్‌ను కలిపిన ఈ పాట, భారీ సెట్‌పై, అద్భుతమైన డాన్స్‌లతో విజువల్ స్పెక్టాకిల్‌గా నిలిచింది. ఎనర్జిటిక్ కంపోజిషన్, బలమైన రిథమ్‌తో శ్రోతలను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇంటర్‌లూడ్స్ పాటకు మరింత గ్రాండ్ ఫీల్‌ను తీసుకువచ్చి.. సెలబ్రేటరీ స్పిరిట్ అందించాయి. జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలనే భావనను ప్రతిబింబించే కేకే సాహిత్యం పాటకు బలం చేకూరిస్తే.. పి. జయరామ్, రమ్య బెహరా తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాట ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. కాగా ఈ పాటను సమంత లాంచ్ చేయగా.. ఫ్యానస్ ఖుష్ అవుతున్నారు. మొత్తానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో వస్తున్న ‘ఛాంపియన్’ ఈ క్రిస్మస్‌కు బిగ్గెస్ట్ ఎట్రాక్షన్గా డిసెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.






