- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Varanasi Movie : మహేష్ బాబుకు భారీ రెమ్యూనరేషన్...ఎన్ని కోట్లంటే ?
రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల రెమ్యూనరేషన్ మహేష్ బాబుకు దక్కనుంది. సాధారణంగా మహేష్ బాబు ఒక్క సినిమాకు రూ.70 కోట్ల వరకు

దిశ, వెబ్‌డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. మాస్, లవ్, యాక్షన్ , కామెడీ నేపథ్యంలో చాలా సినిమాలు చేసిన మహేష్ బాబు, కుర్ర హీరోలకు కూడా పోటీని ఇస్తున్నాడు. అదే సమయంలో 100% సక్సెస్ రేట్ తో దూసుకు వెళ్తున్నాడు మహేష్ బాబు. అలాంటి మహేష్ బాబు ప్రస్తుతం జక్కన్నతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీనే వారణాసి. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా చేస్తుండగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా మెరువనున్నారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. కె ఎల్ నారాయణ, ఎస్ ఎస్ కార్తికేయ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అటు ఎంఎం కీరవాణి సంగీత స్వరాలు అందిస్తున్నారు. దాదాపు ఈ సినిమా రూ.1200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే అలాంటి ఈ వారణాసి సినిమాకు మహేష్ బాబు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఒక్కో ఏడాది చొప్పున ఈ సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట మహేష్ బాబు. దాని ప్రకారం ఏడాదికి 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ మహేష్ బాబుకు ఇచ్చేందుకు చిత్ర బృందం కూడా నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అంటే ఈ సినిమా పూర్తయ్యేసరికి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పట్టే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల రెమ్యూనరేషన్ మహేష్ బాబుకు దక్కనుంది. సాధారణంగా మహేష్ బాబు ఒక్క సినిమాకు రూ.70 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. ఇక ఈ సినిమాకు ఆయన కెరీర్ లోనే భారీగా రెమ్యునరేషన్ రానుంది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా 2027 మార్చిలో వారణాసి సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.






