- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hrithik Roshan: పోటాపోటీగా రిలీజ్ కాబోతున్న కూలీ, వార్-2 సినిమాలు.. ఇలాంటి సమయంలో హృతిక్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
ఎప్పటికీ మీరే నాకు ఇన్‌స్పిరేషన్. రజినీకాంత్ సర్ మీకు ప్రత్యేక అభినందనలు

దిశ, సినిమా: రజినీ కాంత్- నాగార్జున (Rajinikanth-Nagarjuna) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కూలీ’, హృతిక్ రోషన్- జూనియర్ ఎన్టీఆర్ (Hrithik Roshan- Jr. NTR) కాంబినేషన్‌లో రూపొందిన ‘వార్-2’ సినిమాలు ఆగస్టు 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయి అనే దానిపై సినీ లవర్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా క్యూరియాసిటీ నెలకొంది. ఇలాంటి సమయంలో హృతిక్ రోషన్ రజినీకాంత్‌ను తలుచుకుంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా షేర్ చేశాడు.
ఈ మేరకు హృతిక్ రోషన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా రజినీకాంత్ సినిమాలో యాక్ట్ చేసిన ఫొటో షేర్ చేస్తూ ‘రజినీకాంత్ సర్.. నటుడిగా నా తొలి అడుగులు మీ పక్కనే వేశాను. మీరు నా మొదటి గురువులలో ఒకరు. ఇప్పటికీ మీ ఇన్‌స్పిరేషన్‌తోనే ఎదుగుతున్నాను.. నటుడిగా నిలబడ్డాను. 50 సంవత్సరాల ఆన్-స్క్రీన్ మ్యాజిక్‌ను పూర్తి చేసుకున్నందుకు మీరు ప్రత్యేక అభినందనలు’ అంటూ తెలిపాడు. ప్రజెంట్ హృతిక్, రజినీకాంత్‌ల ఓల్డ్ పిక్ వైరల్ కావడంతో.. సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. లింక్






