- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు రోజుల్లో ఛాంపియన్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందంటే..? ట్వీట్ వైరల్
యంగ్ హీరో రోషన్(Roshan Meka), అనస్వర రాజన్(Anaswara Rajan) జంటగా నటించిన సినిమా 'ఛాంపియన్'(Champion).

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో రోషన్(Roshan Meka), అనస్వర రాజన్(Anaswara Rajan) జంటగా నటించిన సినిమా 'ఛాంపియన్'(Champion). ప్రదీప్ అద్వైత్(Pradeep Adhwaith) దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయి మంచి టాక్‌తో దూసుకుపోతుంది.
సుమారు రూ.30 కోట్లతో తీసిన ఈ సినిమా ఫస్ట్ డే నుంచే మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఇందులో భాగంగా మూడో రోజు 8.89+ కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించినట్లు నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘సినిమా థియేటర్లలో తన బ్లాక్ బస్టర్ పరుగును కొనసాగిస్తున్నాడు.. 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 8.89 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ ఛాంపియన్ ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






