- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sundeep Kishan: మజాకా రెస్పాన్స్ అదిరింది .. " సాయంత్రంకల్లా పార్టీ మొదలుపెడదాం" అంటూ సందీప్ కిషన్ పోస్ట్
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టాడు.

దిశ, వెబ్ డెస్క్ : సినిమా చూపిస్తా మావ( cinema Chupista mama) , నేను లోకల్ ( Nenu Local) , హలో గురు ప్రేమ కోసమే( hello guru prema kosame ) , ధమాకా ( Dhamaka ) తో వరుస హిట్స్ కొట్టిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ( Trinadha Rao Nakkina ) ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా కొత్త సినిమాతో మన ముందుకొచ్చాడు. యంగ్ హీరో సందీప్ ( Sundeep Kishan ) కిషన్ హీరోగా హాస్య మూవీస్, AK ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రాజేష్ దండా నిర్మాణంలో తెరకెక్కిన మూవీ " మజాకా " ( Majaka ) . ఈ చిత్రం నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మొదటి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది.
‘మజాకా’ లో సందీప్ కు జోడిగా రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా, అన్షు, రావు రమేష్ రావు రమేష్ ముఖ్య పాత్రలో నటించారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నేడు ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఉదయం నుంచి ఇప్పటి వరకు పడిన షోలు టాక్ బాగానే ఉంది. ముఖ్యంగా, ఫస్ట్ హాఫ్ లో ప్రీ ఇంటర్వెల్ సీన్స్ డైరెక్టర్ బాగా తీశాడని అన్నారు. ఇక సెకండ్ హాఫ్ అయితే కామెడీ, ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయిందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే సినిమాలో హీరోగా నటించిన పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టాడు. " ప్రీమియర్ షోల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సాయంత్రంకల్లా పార్టీ మొదలుపెడదాం లవ్ యూ ఆల్ " అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై రియాక్ట్ అయిన ఫ్యాన్స్ " మా సందీప్ అన్నా కి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి చాలా థాంక్స్ " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






